- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటైనర్ లారీ ఢీ కొని ద్విచక్రవాహనదారుడు మృతి
by Ratna Kumari |
కంటైనర్ లారీ ఢీ కొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన సంఘటన సంతులాల్ పోడు తండా వద్ద చోటు చేసుకుంది.

X
దిశ, బయ్యారం : కంటైనర్ లారీ ఢీ కొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన సంఘటన సంతులాల్ పోడు తండా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు-మహబూబాబాద్ ప్రధాన రహదారి పై మంగళవారం సంతులాల్ పోడు తండా వద్ద కంటైనర్ వాహనం ద్విచక్ర వాహనదారుడు గోనినేని బాబురావు(62)ను ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందినట్టు సమాచారం. పోలీసులు సమాచారం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఘటన స్థలానికి ఎస్సై ప్రశాంత్ బాబు చేరుకున్నారు. కంటైనర్ లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.
Next Story






