తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. స్పాట్‌లోనే డెడ్

by Naga Rani Yarlagadda |

తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం టూవీలర్ ప్రమాదానికి గురైంది. స్వామివారిని దర్శనానంతరం కొండదిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. స్పాట్‌లోనే డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శ్రీవారిని దర్శించుకుని కొండ దిగుతున్న క్రమంలో మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు టూవీలర్ పై కొండ దిగుతుండగా.. 30వ మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. బైక్ రోడ్డుపక్కన ఉన్న పిట్టగోడను ఢీ కొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రగాయాలవ్వగా తోటి భక్తులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నటరాజన్ అనే భక్తుడు స్పాట్లోనే మరణించగా.. మురళి అనే భక్తుడిని స్విమ్స్ (SVIMS) ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు షిఫ్ట్ చేసి వైద్యం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతివేగం లేదా బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఘాట్ రోడ్లలో సొంతవాహనాల్లో ప్రయాణించే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Next Story