- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రైలు ప్రమాదం.. 26 మంది మృతి
గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: గ్రీస్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఓ ప్యాసెంజర్ రైలు ఢీకొన్న ఘటనలో 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 85 మందికి తీవ్ర గాయాలయ్యాయి. థెస్సాలీ గవర్నర్ కాన్స్టాంటినోస్ అగోరాస్టోస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీస్ లోని టెంపెలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 26 మంది మృతి చెందగా.. 85 మందికి పైగా గాయాలయ్యాయి. ప్యాసెంజర్ రైలుకు సంబంధించిన పలు భోగీలు పట్టాలు తప్పగా మొదటి మూడు కోచ్ లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ లో మొత్తం 350 వరకు ప్రయాణికులు ఉన్నారు.
అందులో 250 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగినట్లు స్సాలీ గవర్నర్ కాన్స్టాంటినోస్ అగోరాస్టోస్ తెలిపారు. క్రేన్ల సహాయంతో ట్రైన్ శిథిలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు.






