- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శభాష్ పోలీస్.. నిలిచిన మహిళా ప్రాణాలు.. ఇలాంటి హీరోయిజం సినిమాల్లోనే సాధ్యం
నరసరావుపేట టూ టౌన్ పోలీసులు సమయ స్ఫూర్తి, స్పీడు ఓ మహిళా నిండు ప్రాణాన్ని కాపాడాయి.

దిశ, నరసరావుపేట : నరసరావుపేట టూ టౌన్ పోలీసులు సమయ స్ఫూర్తి, స్పీడు ఓ మహిళా నిండు ప్రాణాన్ని కాపాడాయి. తమ పోలీస్ స్టేషన్ పరిధి కాకున్నా.. సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలోని పట్టణ శివారులో ఉన్న ఇంటి తలుపులు బద్దలు కొట్టి.. ఉరికి వేళాడబడి కొన ఊపిరితో ఉన్న మహిళ ప్రాణాలను కాపాడి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు నరసరావుపేటలో టూటౌన్ పోలీసుల మానవత్వం గురించే చర్చి్ంచుకుంటున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే..
నరసరావుపేట శివారు వల్లప్ప చెరువు సమీపంలోని ఓ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. పరిస్థితి విషమంగా మారుతున్న సమయంలో, ఆమె భర్త టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ప్రభాకర్‌కు ఫోన్ చేసి తన భార్యను కాపాడాలని వేడుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. హెడ్ కానిస్టేబుల్ కరిముల్లాను సంఘటనా స్థలానికి పంపించారు. అక్కడికి చేరుకున్న కరిముల్లా పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని గుర్తించాడు. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించి మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. హుటాహుటిన ఆమెను హాస్పిటల్‌కు తరలించి ప్రాణాలు కాపాడారు.
ఈ ఘటనలో టూటౌన్ పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన స్పందన, మానవత్వం కలిసి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడాయి. తమ పరిధి కాదన్న భావన లేకుండా కేవలం ప్రాణ రక్షణే లక్ష్యంగా పనిచేసిన సీఐ ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ కరిముల్లా సేవలను స్థానిక ప్రజలు హర్షిస్తూ అభినందిస్తున్నారు. పోలీసులు అంటే భయం కాదు.. భరోసా కూడా! అని మరోసారి నిరూపించిన టూటౌన్ పోలీసులకు శభాష్ అంటున్నారు ప్రజలు.






