భారీ ఎన్‌‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-13 14:53:58  IST  )

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో మరో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది.

భారీ ఎన్‌‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో మరో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. మదన్ వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు(Maoist), భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మరణించారు. సెంట్రల్ కమిటీ మెంబర్ విజయ్ అలియాస్ రామచంద్రా రెడ్డి, డీవీసీ మెంబర్ లోకేష్ సలామే మృతిచెందినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో డీఆర్జీ, ఐటీబీపీ బలగాలు పాల్గొన్నాయి. ఐజీ అభిషేక్ శాండిల్య ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story