- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: నడిరోడ్డుపై హైడ్రామా.. పోలీసు వాహనం నుండి దూకేసిన ఖైదీలు
రాష్ట్ర రాజధానిలో పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి చర్చనీయాంశమైంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధానిలో పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి చర్చనీయాంశమైంది. చంచల్‌గూడ జైలుకు చెందిన ఇద్దరు ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి సినిమా ఫక్కీలో తప్పించుకున్నారు. కోర్టు విచారణ నిమిత్తం వారిని వాహనంలో తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరిని ఈరోజు ఉదయం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు వాహనంలో తీసుకువెళ్లారు. అయితే, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆగిన సమయంలో భద్రతా సిబ్బంది ఏమరపాటుగా ఉండటాన్ని గమనించిన ఖైదీలు, చాకచక్యంగా వాహనం నుండి దూకి పరారయ్యారు. ఖైదీలు తప్పించుకున్న విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో నగరవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఖైదీలు ఏ దిశగా వెళ్లారో తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తప్పించుకున్న ఖైదీలు ఏయే కేసుల్లో నిందితులు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి.






