రాష్ట్రంలో సంచలనం.. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ పోలీసులు..

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-31 17:42:28  IST  )

ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు సైద్‌నగలి పోలీసులు. ఆరుగురు డ్రగ్ ట్రాఫికర్స్‌తోసహా ఇందుకు సహకరిస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు.

రాష్ట్రంలో సంచలనం.. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ పోలీసులు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ అమ్రోహా జిల్లాలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు సైద్‌నగలి పోలీసులు. నలుగురు డ్రగ్ ట్రాఫికర్స్‌తోసహా ఇందుకు సహకరిస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గరున్న స్మాక్‌ను ఢిల్లీలో అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. తనిఖీల సమయంలో కారులో రూ. 40లక్షల విలువైన స్మాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక కానిస్టేబుల్ యోగేష్ కుమార్ గౌతమ్ బుద్ధ నగర్‌లోని జహంగీర్‌పూర్‌కు చెందిన వాడు కాగా, మరో కానిస్టేబుల్ ఆశు షైనీ ముజఫర్ నగర్‌లోని బహ్రమ్‌గఢ్‌కు చెందినవాడు. వీరిద్దరూ అమ్రోహాలోని ఆదంపూర్‌లో పీఎస్‌లో పని చేస్తున్నారు. కాగా మిగిలిన ఆనిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి పోలీసులే డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Next Story