కాల్పుల కలకలం..ఇద్దరు వ్యక్తుల కాల్చివేత, ఒకరికి తీవ్ర గాయాలు

by Malleboina Mahesh |

బటాలాలో దారుణం! ఇద్దరిపై కాల్పులు జరిపి చంపిన దుండగులు. పాత కక్షలే కారణమని పోలీసుల అనుమానం.

కాల్పుల కలకలం..ఇద్దరు వ్యక్తుల కాల్చివేత, ఒకరికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా పంజాబ్‌ రాష్ట్రంలో గన్ కల్చర్ (Gun culture) విపరీతంగా పెరిగిపోయింది. గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్‌లుగా చలామని అవుతున్న వారిపై నిత్యం కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గురుదాస్‌పూర్ జిల్లా బటాలా ప్రాంతంలో పట్టపగలే జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను పరమ్జిత్, సుఖ్విందర్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అమృత్‌సర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘోర కలికానికి పాత కక్షలు, గ్యాంగ్ వార్ కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని బటాలా పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Next Story