- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మృతి
by Ratna Kumari |
దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేట గ్రామానికి చెందిన కరిడే మల్లేష్ కొత్తపేట గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు గురువారం ఆసుపత్రిలో

X
దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేట గ్రామానికి చెందిన కరిడే మల్లేష్ కొత్తపేట గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కరిడే మల్లేష్ రెండు రోజుల క్రితం లో బీపీ కాగా తనే స్వయంగా మంచిర్యాల కు కారు నడుపుతూ వెళ్లి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా మృతి చెందారు. అదేవిధంగా వారం రోజుల క్రితం కిషన్ రావు పేట వద్ద రాష్ట్ర రహదారి పై రెండు బైకులు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కాగా.. చికిత్స పొందుతూ కొత్తపేట గ్రామానికి చెందిన లక్ష్మన్ రావు మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులకు భార్య పిల్లలు ఉన్నారు.
Next Story






