- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40 మంది ప్రయాణికులతో లోయలోకి దూసుకెళ్లిన బస్సు
40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలోని సిమ్రోల్ పోలీస్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలోని సిమ్రోల్ పోలీస్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భేరు ఘాట్ వద్ద నియంత్రణ కోల్పోయి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో 38 మంది గాయపడ్డారు. రాత్రి సమయంలో వంకల రహదారిపై బస్సు స్కిడ్ అవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలంలో రక్షణ సిబ్బంది, స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. రాత్రి సమయంలో బస్సు నియంత్రణ కోల్పోవడం, మలుపు వద్ద వేగం అధికంగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More..
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. కంటైనర్ లారీ బోల్తా
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఐదుగురికి తీవ్ర గాయాలు






