గంగమ్మ జాతరలో విషాదం.. ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

గంగమ్మ జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

గంగమ్మ జాతరలో విషాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో జరుగుతున్న గంగమ్మ జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో గంగమ్మ జాతర జరుగుతున్న సమయంలో విద్యుత్ షాక్ కు గురై ఇద్దరు మరణించారు. ఇద్దరూ రేకులషెడ్డులో ఉన్న ఇనుప ఊయలపై ఊగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఊయలకు కరెంట్ పాస్ అవ్వడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ముదివేడు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమా ? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతరలో భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ కనెక్షన్లలో లోపాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Next Story