- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొబ్బరి బొండం తెచ్చిన ముప్పు.. ఇద్దరు మృతి..?
కారు బ్రేక్ కింద కొబ్బరిబోండం ఇరుక్కుని అదుపుతప్పడంతో కంటైనర్‌ను ఢీకొట్టి పురోహితుడు సహా ఇద్దరు మృతి!

దిశ, వెబ్ డెస్క్: ఉహించని ప్రమాదంలో ఓ కొబ్బరిబొండం ఇద్దరు ప్రాణాలు తీసింది. ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డుపై జరిగిన రోడ్డు ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కారు బ్రేక్, క్లచ్ పెడల్స్ మధ్య ఒక కొబ్బరి బోండం ఇరుక్కుపోవడం వల్ల బ్రేకులు పడక ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ పురోహితుడి తో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరానికి చెందిన దువ్వురి హరిప్రసాద్ (52) పురోహితుడిగా పనిచేస్తున్నారు. ఆయన చిన్న కుమారుడి వివాహం గురువారం హైదరాబాద్‌లో పెళ్లికుమార్తె నివాసంలో ఘనంగా జరిగింది. వివాహ వేడుకలు ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఒక కారులో బయలుదేరగా.. హరిప్రసాద్ తన కారు వెనుక సీట్లో పూజా సామాగ్రి తో కలిసి రాజమహేంద్రవరం వైపు తిరుగు ప్రయాణమయ్యారు. విజయవాడ సమీపంలోని నల్లగుంట వద్ద ఆయనతో ఉన్న బంధువు ఒకరు కారు దిగిపోవడంతో, హరిప్రసాద్ ఒక్కరే కారు నడుపుకుంటూ ముందుకు సాగారు.
గొల్లపూడి బైపాస్ రోడ్డు సమీపంలోకి రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి ముందు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి, ఆపై అక్కడే రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించగా కారు బ్రేక్, క్లచ్ మధ్య కొబ్బరిబోండం ఇరుక్కుని ఉండటం గమనించారు. మొదట ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సమయంలో.. కారు వెనుక సీట్లో ఉన్న కొబ్బరి బొండం ఒక్కసారిగా ఎగిరివచ్చి డ్రైవింగ్ సీట్ కింద ఉన్న బ్రేక్, క్లచ్ పెడల్స్ మధ్య ఇరుక్కుపోయి ఉంటుందని, దీనివల్ల కారును ఆపడం సాధ్యం కాకనే వేగంగా వెళ్లి కంటైనర్‌ను ఢీకొట్టిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ భీకర ప్రమాదంలో కారు నడుపుతున్న పురోహితుడు హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్రవాహనంపై ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






