- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో మృత్యువు కారు రూపంలో వచ్చి బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది.

దిశ, ఉట్నూర్ : శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో మృత్యువు కారు రూపంలో వచ్చి బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామానికి చెందిన రాథోడ్ రాంజీ (70), ఆడే ప్రకాష్(49) లు ఇద్దరు కలిసి గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగే శుభకార్యానికి బైక్ పై వెళ్తున్నారు. మండలంలో ఈశ్వర్ నగర్, ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ బీ చౌరస్తా సమీపంలో వెళ్ళగానే వెనుక నుండి బైక్ ను కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్ళే ప్రయాణికులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించారు. అక్కడికి చేరుకోగానే మృతి చెందారు. ఫంక్షన్ కి వెళ్లి వస్తామని చెప్పి ఇంటికి నుండి వెళ్ళిన 5 నిమిషాలు కాకముందే ప్రమాదంలో మృతి చెందడంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాంజీ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇంద్రవెల్లి పోలీసులు పేర్కొన్నారు.






