- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Accident : సదాశివపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..
by Batti.Sumithra |
సదాశివపేటలోని జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం నిజాంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ( road accident ) చోటుచేసుకుంది.

X
దిశ, సదాశివపేట : సదాశివపేటలోని జాతీయ రహదారి పై ఆదివారం ఉదయం నిజాంపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ( road accident ) చోటుచేసుకుంది. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన మరో లారి (ట్రక్కు) ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఒకరి పరిస్థితి విషమం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగి ఉన్న లారీకి క్లీనర్లు పంక్చర్ చేస్తుండగా మరో లారీ ట్రక్కు అతి వేగంగా వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఇద్దరు క్లీనర్లు అక్కడికక్కడే మరణించారు. మృతులు ఘట్కేసర్ లోని అన్నాజిగూడకు చెందిన దీపక్, పరమేశ్వర్ లుగా గాయపడ్డ కంటైనర్ డ్రైవర్ యోగేష్, క్లీనర్లు శేఖర్, దేవి సింగ్ లు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో మరిన్ని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.
Next Story






