Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్ధరు ఐటీ ఇంజనీర్ల మృతి

by Y. Venkata Narasimha Reddy |

మహారాష్ట్ర పూణేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Rroad Accident)లో ఇద్ధరు ఐటీ ఇంజనీర్లయిన యువతులు(Two IT Engineers) దుర్మరణం(Die) చెందారు.

Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్ధరు ఐటీ ఇంజనీర్ల మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర పూణేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Rroad Accident)లో ఇద్ధరు ఐటీ ఇంజనీర్లయిన యువతులు(Two IT Engineers) దుర్మరణం(Die) చెందారు. అదుపు తప్పి కాంక్రీట్ లారీ బోల్తా కొట్టడంతో దాని కింద పడి వారు అక్కడికక్కడే మృతి చెందారు. హింజావాడి నుంచి మహాలుంగేకు వెళ్తున ట్రక్కును క్రాస్ చేసే క్రమంలో కాంక్రీట్ లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తమ దారిన తాము స్కూటిపై వెలుతున్న యువతులను కాంక్రీట్ లారీ రూపంలో మృత్యువు కబళించిన తీరును చూసిన వారు ఈ విషాద ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఈ ఘటన తీవ్ర విషాదం రేపింది. తరుచు ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న అధికారులు నివారణ చర్యల్లో విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story