- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్స్ వర్కర్లపై దాడి.. ఇద్దరు భారతీయ పర్యాటకులకు ఐదేళ్ల జైలు శిక్ష
by Malleboina Mahesh |
హోటళ్లలో దోపిడీ, సెక్స్ వర్కర్లపై దాడి చేసినందుకు ఇద్దరు భారతీయ పర్యాటకులకు జైలు శిక్ష విధించారు.

X
దిశ, వెబ్ డెస్క్: హోటళ్లలో దోపిడీ, సెక్స్ వర్కర్లపై దాడి చేసినందుకు ఇద్దరు భారతీయ పర్యాటకులకు జైలు శిక్ష విధించారు. ఈ ఘటన శుక్రవారం సింగపూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింగపూర్‌లో సెలవులను ఆనందంగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు హోటల్ గదుల్లో ఇద్దరు లైంగిక కార్మికులను దోచుకుని దాడి చేసినందుకు ప్రయత్నించారు. దీంతో ఆ సెక్స్ వర్కర్లు వెంటనే పోలీసులను ఆశ్రయించగా..దొంగతనం, దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు శుక్రవారం ఐదు సంవత్సరాల ఒక నెల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బలు విధించారు. పోలీసుల విచారణలో ఇద్దరు యువకులు బాధితులను దోచుకున్నట్లు నేరాన్ని అంగీకరించారు. కాగా శిక్ష పడిన ఇద్దరు యువకులు.. అరోక్కియాసామి, రాజేంద్రన్ ఏప్రిల్ 24న భారతదేశం నుండి సెలవుల కోసం సింగపూర్‌కు వెళ్లారు.
Next Story






