- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టాలు తప్పిన రెండు గూడ్స్ రైళ్లు.. చెల్లాచెదురుగా పడినపోయిన బోగీలు
ఓ గూడ్స్ రైళ్లు (Good Trains) పట్టాలు తప్పి మరో గూడ్స్ రైలును ఢీకొట్టిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఓ గూడ్స్ రైళ్లు (Good Trains) పట్టాలు తప్పి మరో గూడ్స్ రైలును ఢీకొట్టిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టాటానగర్ (TATA Nagar)నుంచి పురులియా (Purulia) వైపు వెళ్తున్న ఇనుము లోడ్ చేసిన గూడ్స్ రైలు, చాందిల్ స్టేషన్ (Chandil Station) దాటిన ఉదయం 4 గంటల సమయంలో పట్టాలు తప్పింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ రైలుతో ఢీకొనడంతో రెండో రైలు కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటన చాందిల్ జంక్షన్ సమీపంలోని ఆద్రా రైల్వే డివిజన్ (Aadra Railway Division) పరిధిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాయి. ప్రమాదంలో ఇరు ట్రైన్లలోని మోటోమెన్లు గాయపడగా వారిని చికిత్ నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.






