- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, నాచారం : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బక్షిగూడ కాలనీకి చెందిన గంగాధర్ (41) లేబర్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. జడుపుల గణేష్ (49) కాంట్రాక్టర్. ఇద్దరు కలసి మౌలాలి ప్రాంతంలో రాళ్లు కొట్టే పనికి వెళ్లేవారు. మంగళవారం రాత్రి పని కోసం లోడ్ వచ్చిందని సమాచారం రావడంతో గంగాధర్ తన బైకు పై ఇంటి నుంచి బయలుదేరారు. మంగళవారం అర్థరాత్రి శక్తి సాయినగర్ నుంచి బెల్ కంపెనీ రోడ్డువైపు వెళ్తున్నారు. మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ హాల్ సమీపంలో TS03FG-0147 అతివేగంగా నిర్లక్ష్యంగా వచ్చి వారి బైకును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో గంగాధర్, గణేష్ కి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గంగాధర్ అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. గణేష్ ను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సంఘటన స్థలంలో వాహనాన్ని వదిలి పరారయ్యారు. గంగాధర్ భార్య రాధ నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.






