రెండు ఘోర పడవ ప్రమాదాలు.. ఏకంగా 193 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-13 03:07:15  IST  )

కొంగో (Congo)లోని ఈక్వేటర్ ప్రావిన్స్‌ (Equateur Province)లో రెండు వేర్వేరు పడవ ప్రమాదాలు చోటుచేసుకున్నారు.

రెండు ఘోర పడవ ప్రమాదాలు.. ఏకంగా 193 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కొంగో (Congo)లోని ఈక్వేటర్ ప్రావిన్స్‌ (Equateur Province)లో రెండు వేర్వేరు పడవ ప్రమాదాలు చోటుచేసుకున్నారు. ఈ దుర్ఘటనల్లో దాదాపు 193 మంది మరణించారు. వివరాల్లోకి వెళితే.. లుకోలెలా టెరిటరీ (Lukolela Territory) పరిధిలోని నదిలో గురువారం సాయంత్రం దాదాపు 500 మంది ప్రయాణికులతో ఒక ఓడ ఆగ్నేయం వైపునకు బయలుదేరింది. ఈ క్రమంలోనే పడవలో ఉన్నట్టుండి భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఓడలోకి భారీగా నీరు రావడంలో నదిలో ఓడ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 107 మంది మరణించగా మరో 146 మంది బతికి బయటపడ్డారు. అదేవిధంగా బసంకుసు టెరిటరీ (Basankusu Territory) పరిధిలో ఒకరోజు ముందు ఒక మోటారైజ్డ్ ఓడ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 86 మంది మరణించారు. కానీ, ఆ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, కేవలం రెండు రోజు వ్యవధిలో రెండు ఓడ ప్రమాదాలు జరగడంతో అక్కడి ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.

Next Story