తమిళనాడులో దారుణం.. బాలికపై పోలీసుల అత్యాచారం

by Sujitha Rachapalli |

తమిళనాడు తిరువణ్ణామలైలో దారుణం చోటు చేసుకుంది. 19ఏళ్ల బాలికపై ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈస్ట్ పీఎస్‌కు చెందిన పోలీసులు.. ఎందల్ గ్రామ సమీపంలో వాహనం

తమిళనాడులో దారుణం.. బాలికపై పోలీసుల అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు తిరువణ్ణామలైలో దారుణం చోటు చేసుకుంది. 19ఏళ్ల బాలికపై ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈస్ట్ పీఎస్‌కు చెందిన పోలీసులు.. ఎందల్ గ్రామ సమీపంలో వాహనం తనిఖీ చేస్తున్న టైమ్‌లో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో పోలీసులను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. పోలీసులు డి. సురేష్ రాజ్, పి. సుందర్.. ట్రక్‌లో కూరగాయలు తీసుకెళ్తున్న అక్కాచెల్లెళ్లను స్టేషన్‌లో ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు. బైక్‌పై ఎక్కించుకుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. బాలికపై కొన్ని గంటలపాటు అత్యాచారం చేశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు రోడ్డు పక్కన వదిలేశారు. వీరిని గమనించిన ఇటుక బట్టీ కార్మికులు.. అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అత్యాచారాన్ని ధృవీకరించిన వైద్యులు.. పోలీసులకు సమాచారం అందించారు.

Next Story