క‌రీంన‌గ‌ర్ లో దారుణం.. కసాయి తండ్రి ఘాతుకానికి ఇద్దరు చిన్నారులు బలి

by Ratna Kumari |

కుటుంబ క‌ల‌హాల‌తో ఇద్ద‌రు కూతుళ్ల‌ను చంపి బావిలో ప‌డేసిన ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ మండ‌లం జూబ్లీ న‌గ‌ర్ లో చోటు చేసుకుంది.

క‌రీంన‌గ‌ర్ లో దారుణం.. కసాయి తండ్రి ఘాతుకానికి ఇద్దరు చిన్నారులు బలి
X

దిశ‌, క‌రీంన‌గ‌ర్ రూర‌ల్ : కుటుంబ క‌ల‌హాల‌తో ఇద్ద‌రు కూతుళ్ల‌ను చంపి బావిలో ప‌డేసిన ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ మండ‌లం జూబ్లీ న‌గ‌ర్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జూబ్లీ నగర్ కు చెందిన గచ్చు శ్రీ శైలం కి గీతం శ్రీ, గీతాన్విక (5) ఇద్ద‌రు క‌వ‌ల‌పిల్ల‌లు. కుటుంబ క‌ల‌హాల‌తో ఇద్ద‌రు చిన్నారుల‌కు గ‌డ్డి మందు తాగించి అనంత‌రం బావిలో ప‌డేశాడు తండ్రి గ‌చ్చు శ్రీశైలం. శుక్రవారం ఉదయం భార్యతో గొడవపడిన అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. దారుణానికి పాల్పడిన శ్రీశైలంకి స్థానికులు దేహశుద్ధి చేసి కరీంనగర్ రూరల్ పోలీసులకు అప్పగించారు. ఈ చిన్నారుల మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story