చేవెళ్లలో దారుణం.. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు(Two Children Dead) ఊపిరి ఆడక మృతిచెందారు.

చేవెళ్లలో దారుణం.. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) మండలం దామరగిద్దలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు(Two Children Dead) ఊపిరి ఆడక మృతిచెందారు. అప్పటివరకు డోర్లు ఓపెన్ చేసి ఉండగా.. ఆడుకుంటూ ఆడుకుంటూ డోర్లు క్లోజ్ చేశారు. ఆ డోర్లు కాస్త లాక్(Door Lock) పడటంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయి.. తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) మృతిచెందారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుడా పోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు చిన్నారులు మృతిచెండటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story