ఢిల్లీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

తూర్పు ఢిల్లీలోని షాహ్దారాలోని ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్‌ లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం కాగా.. నలుగురు గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు.

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు ఢిల్లీలోని షాహ్దారా (Delhi Fire Accident)లోని ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్‌ (E-Rickshaw Charging Station)లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం కాగా.. నలుగురు గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు. షాహ్దారాలోని మోతీ రామ్ రోడ్ (Moti Ram Road)లోని రామ్ మందిర్ సమీపంలో నుంచి ఉదయం 6.40 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు ఢిల్లీ అగ్నిమాపక విభాగం తెలిపింది.

సమాచారం అందిన వెంటనే 5 ఫైరింజన్లతో ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ-రిక్షాలకు ఛార్జింగ్ స్టేషన్ గా ఉపయోగిస్తున్న సుమారు 400 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన టిన్ షెడ్ నిర్మాణంలో మంటలు చెలరేగాయి. ఉదయం 8.30 గంటలకు మంటలు అదుపులోకి రాగా.. రెండు మృతదేహాలను గుర్తించినట్లు డీఎఫ్ఎస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలవ్వగా వారిని రక్షించి సమీపంలోని జీటీబీ ఆస్పత్రి (GTB Hospital)కి తరలించారు. మృతులు షెడ్ లో నివసిస్తున్న కార్మికులై ఉండవచ్చన్నారు.

Next Story