ఈత‌కు వెళ్లి ఇద్ద‌రు బాలురు మృతి

by Ratna Kumari |

ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో మునిగి మృతి చెందిన విషాద ఘటన మాసాయిపేట మండలం హాకింపేట గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.

ఈత‌కు వెళ్లి ఇద్ద‌రు బాలురు మృతి
X

దిశ‌, చేగుంట/ వెల్దుర్తి : ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో మునిగి మృతి చెందిన విషాద ఘటన మాసాయిపేట మండలం హాకింపేట గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. మాసాయిపేట గ్రామానికి చెందిన జల నంద కిషోర్ (15), భాను(15) ఈత కొట్టేందుకు హకీంపేట గ్రామ శివారులో ఉన్న క్వారీ గుంత వద్దకు వెళ్లారు. ఈత కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతైన నీటి గుంత వైపు వెళ్లి మునిగిపోయి ఇద్దరూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బాలుర మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు బాలురు మృతి చెందడంతో మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story