- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు..
by Taduka Kalyani |
రెండు బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం, శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.

X
దిశ, వడ్డేపల్లి: రెండు బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం, శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామానికి చెందిన ముత్తయ్య (60) శాంతినగర్ కు తన సొంత పనిమీద వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన తురుకమౌలాలి (68), మనుమడు తురుక గోకారి (13) శాంతినగర్ నుంచి బుడమర్సుకు వస్తున్న క్రమంలో పైపాడు స్టేజి సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ముత్తయ్య కు కాలు చేయి విరిగింది, గోకారికి తీవ్రంగా గాయాలు అయి కాలు విరిగింది. మౌలాలికి గాయాలైనాయి. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను కర్నూల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
Next Story






