రచయిత బొగ్గుల శ్రీనివాస్ కేసులో ట్విస్ట్.. సుపారీ హత్యేనని తేల్చిన పోలీసులు

by Kema Shiva Kumar |

రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును ఖమ్మం పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే కారణమంటూ నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

రచయిత బొగ్గుల శ్రీనివాస్ కేసులో ట్విస్ట్.. సుపారీ హత్యేనని తేల్చిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (Boggula Srinivas) మృతి కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడిది సాధారణ మరణం కాదని, పక్కాగా ప్లాన్ చేసిన సుపారీ హత్య అని ఖమ్మం పోలీసులు (Khammam Police) నిర్ధారించారు. బొగ్గుల శ్రీనివాస్ హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలేనని స్పష్టం చేశారు. నిందితులు శ్రీనివాస్‌ను హతమార్చిన తర్వాత, ఆ మృతదేహాన్ని పాలేరు రిజర్వాయర్‌లో పడేశారని పేర్కొన్నారు. అయితే ఈ మొత్తం తతంగాన్ని ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు విఫలయత్నం చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.

నలుగురు నిందితులు అరెస్ట్..

ఈ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి (Venumadhav Reddy)తో సహా నలుగురిని కూసుమంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక బొగ్గుల శ్రీనివాస్ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై ఒక పుస్తకాన్ని రచించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన హత్యకు ఈ పుస్తకానికి ఎలాంటి సంబంధం లేదని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక పరమైన గొడవలే శ్రీనివాస్ హత్యకు దారితీశాయని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Next Story