- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొయినాబాద్ జంట హత్యల కేసులో ట్విస్ట్.. ప్రధాన నిందితురాలు ఆత్మహత్యాయత్నం
మొయినాబాద్ జంట మహిళల హత్య కేసులో ప్రధాన నిందితురాలు కరీంబీ కరణ్‌కోట్ పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మొయినాబాద్ (Moinabad) జంట మహిళల దారుణ హత్య కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీంబీ (Karimbi) పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు విచారిస్తున్న సమయంలోనే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
అయితే, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి, మొయినాబాద్ ఫామ్‌హౌస్ సమీపంలో దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కరణ్‌కోట్ (Karankot) పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితురాలు కరీంబీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం విచారణ జరుగుతున్న సమయంలో కరీంబీ బాత్రూమ్‌కు వెళ్తానని పోలీసులకు చెప్పింది. లోపలికి వెళ్లిన ఆమె అక్కడే ఉన్న క్లీనింగ్ కోసం ఉంచిన ఫినాయిల్‌ను మొత్తం తాగేసింది. లోపల నుంచి శబ్దాలు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి కరీంబీ అపస్మారక స్థితిలో పడి ఉంది. పోలీస్ స్టేషన్‌లో నిందితురాలి ఆత్మహత్యాయత్నంతో పోలీసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స అనంతరం కరీంబీ పరిస్థితి విషమంగా మారడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెను మెరుగైన వైద్యం కోసం తక్షణమే హైదరాబాద్ (Hyderabad)లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు అత్యవసర చికిత్స అందుతోంది.






