- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధురానగర్ పవన్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్..!
మధురానగర్ వ్యక్తి మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మధురానగర్ లో నివాసం ఉంటున్న పవన్ కుమార్‌ను కుక్క దాడి చేసి హతమార్చిందని అనుమానించారు.

దిశ, వెబ్ డెస్క్: మధురానగర్ వ్యక్తి మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. మధురానగర్ లో నివాసం ఉంటున్న పవన్ కుమార్‌ను కుక్క దాడి చేసి హతమార్చిందని అనుమానించారు. కుక్క నోటిలో రక్తం ఉండటంతో అదే దాడి చేసి చంపిందని అనుకున్నారు. కానీ అనారోగ్య సమస్యలతో పవన్ కుమార్ చనిపోయినట్టు డాక్టర్లు నిర్దారించారు. పవన్ కుమార్ ను కాపాడే ప్రయత్నంలో కుక్క నోటికి రక్తం అంటిందని అనుమానిస్తున్నారు.
అందువల్లే పవన్ ఒంటిపై కాట్లు పడి ఆ రక్తం నోటికి అంటిందని తెలిపారు. పవన్ కుమార్ ఏపీకి చెందిన వ్యక్తి కాగా హైదరాబాద్ లో ఓ ప్రైవేటులో కంపెనీలో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా పవన్ ఆఫీసుకు వెళ్లడం లేదు. ఆదివారం శనివారం రాత్రి బయటకు వచ్చి నిద్రపోగా అతడి కుక్క కూడా పక్కనే పడుకుంది. ఉదయం అతడి స్నేహితుడు వచ్చి చూసేసరికి పవన్ గాయాలతో చనిపోయి ఉన్నాడు. దీంతో పవన్‌ను కుక్కనే హతమార్చిందని అనుమానం వ్యక్తం చేశారు. చివరికి విచారణలో అసలు నిజం బయటపడింది.






