Honeymoon murder: హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసులో మ‌రో ట్విస్ట్..ప్రియుడితో కాకుండా అత‌డితోనూ సోన‌మ్?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-18 10:19:45  IST  )

హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ (Honeymoon muder case) కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలంటేనే అబ్బాయిలు వ‌ణికిపోతున్నారు.

Honeymoon murder: హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ కేసులో మ‌రో ట్విస్ట్..ప్రియుడితో కాకుండా అత‌డితోనూ సోన‌మ్?
X

దిశ‌, వెబ్ డెస్క్: హ‌నీమూన్ మ‌ర్డ‌ర్ (Honeymoon muder case) కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌తో పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలంటేనే అబ్బాయిలు వ‌ణికిపోతున్నారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వ‌స్తోంది. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సంజ‌య్ వ‌ర్మ అనే వ్య‌క్తితో సోన‌మ్ 25 రోజుల్లోనే 119 ఫోన్ కాల్స్ మాట్లాడిన‌ట్టు అధికారులు గుర్తించారు. అత‌డికి పోలీసులు ఫోన్ చేయ‌గా స్విచ్ ఆఫ్ వ‌స్తోంది. దీంతో ఈ కేసులో అత‌డి ప్ర‌మేయం కూడా ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

ఇక ఈ కేసులో సోన‌మ్ కాల్ లిస్ట్ కీల‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. మ‌ర్డ‌ర్ జ‌రిగింద‌ని గుర్తించిన త‌ర‌వాత పోలీసులు సోన‌మ్ (Sonam) కాల్ లిస్ట్ చెక్ చేయ‌గా అత‌డి ప్రియుడితో హ‌త్య జ‌రిగిన రోజు అంత‌కు ముందు ఎక్కువ‌గా మాట్లాడిన‌ట్టు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో సోనమ్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. త‌ర‌వాత మిగితా నింధితుల‌ను సైతం ప‌ట్టుకున్నారు.

ఇక సోన‌మ్ త‌న ప్రియుడితో పాటు సంజ‌య్ వ‌ర్మ‌తో మాట్లాడ‌టంతో అత‌డు ఎవ‌రా అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. అంతే కాకుండా సోన‌మ్ భ‌ర్త రాజా ర‌ఘువంశీ (Raja raghu vamshi) సోద‌రుడు ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొందరి ప్ర‌మేయం కూడా ఉండ‌వ‌చ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నాడు. సోన‌మ్ త‌ల్లి దండ్రుల‌కు నార్కో టెస్ట్ చేయాల‌ని కోరుతున్నాడు. ఇప్ప‌టికే సోన‌మ్ త‌ల్లి దండ్రుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కూతురు ప్రేమ విష‌యం తెలిసి కూడా వేరే వ్య‌క్తికి ఇచ్చి వివాహం చేయ‌డం వ‌ల్ల‌నే ఈ హ‌త్య జ‌రిగింద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. కాబ‌ట్టి ముందు వాళ్ల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story