బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. స్పాట్‌లోనే 10 మంది దుర్మరణం

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదంలో ఏకంగా పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. స్పాట్‌లోనే 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఏకంగా పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుర్డ్‌వాన్‌ సిటీలోని ప్రయాణికులతో వెళ్తున్న బస్సును, ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే 10 మంది మృతి చెందగా.. మరో 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వారంతా బిహార్‌లోని చంపారన్‌ జిల్లా మొటిహరికి చెందిన వారని తెలిపారు.

Next Story