గిరిజన విద్యార్థిని ఆత్మహత్య..

by Taduka Kalyani |

ఇటీవల పదవ తరగతి పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో చోటు చేసుకుంది.

గిరిజన విద్యార్థిని ఆత్మహత్య..
X

దిశ, ఆమనగల్లు: ఇటీవల పదవ తరగతి పూర్తి చేసుకున్న గిరిజన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో చోటు చేసుకుంది. ఆమనగల్లు మండల పరిధి రామనుంతల గ్రామ మాజీ సర్పంచ్ శ్వేత ఆనంద్ కుటుంబం ఆమనగల్లు పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె శ్రీనిధి(16)ఇటీవల పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. పై చదువుల కోసం శ్రీనిధిని హాస్టల్ లో ఉండి చదువుకునే విధంగా హైదరాబాదులోనే ఓ ప్రైవేట్ కళాశాలలో తల్లిదండ్రులు చేర్పించారు.

హాస్టల్ లో ఉండటం ఇష్టం లేని శ్రీనిధి తీవ్ర మనస్థాపానికి గురై మంగళవారం ఉదయం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

Next Story