స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. పట్టాలపై ఎగిరిపడ్డ విద్యార్థులు

by Malleboina Mahesh |

వేగంగా వచ్చిన రైలు పట్టాలు దాటుతున్న ఓ స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది.

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. పట్టాలపై ఎగిరిపడ్డ విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్: వేగంగా వచ్చిన రైలు పట్టాలు దాటుతున్న ఓ స్కూల్ వ్యాన్‌ (School van)ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదం (Fatal accident) తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడలూరు సమీపంలో ఉన్న ఓ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని పట్టాలను దాటుతుంది. అయితే రైలు రావడం గమనించని సిబ్బంది.. గేట్ వేయకపోవడంతో స్కూల్ బస్సు పట్టాలను క్రాస్ చేసే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే వేగంగా వచ్చిన రైలు.. స్కూల్ బస్సును బలంగా ఢీకొట్టింది.

దీంతో స్కూల్ బస్సుతో పాటు విద్యార్థులు గాల్లోకి ఎగిరి పది మీటర్ల దూరంలో పడిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు (Three students died) చనిపోయినట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story