- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం
చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంట్రైనర్ కారుపై పడటంతో నుజ్జునుజ్జయింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, కంటైనర్ ఢీకొన్న ఘటనలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. జిల్లాలోని చిత్తూరు నగర శివారులోని ఇరువారం కూడలిలో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారుపై కంటైనర్ పడటంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించాడు. కారు పూర్తిగా అనిగిపోయింది. మృతుడిని గుడిపాల మండలం రామాపురానికి చెందిన అనుదీప్‌గా గుర్తించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. కారు.. కంటైనర్ కింద ఇరుక్కుపోవడంతో దానిని తొలగించడం కష్టతరంగా మారింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను చూసిన పోలీసులు కారులో ఆరుగురు ఉండి ఉంటారని భావించారు. దానిని కంటైనర్ కింది నుంచి వెలికి తీశాక.. ఒక మృతదేహం మాత్రమే లభ్యమైనట్లు తెలిపారు.






