- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: హైదరాబాద్ నడిబొడ్డున ఘోరం.. రైలు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం
రైలు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున ఇవాళ మధ్యాహ్నం చోటచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రైలు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరం నడిబొడ్డున ఇవాళ మధ్యాహ్నం చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాకుత్‌పురా (Yakutpura) ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు తమ గొర్రెలను మేత కోసం సమీపంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో కొట్టుకెళ్లారు. ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చెట్టు కొమ్మలను కొట్టేందుకు అన్నదమ్ములు ఇద్దరు చెట్టు ఎక్కగా.. కొమ్మ విరిగి నేరుగా పట్టాలపై పడిపోయారు. అదే సమయంలో ట్రాక్‌పైకి అతవేగంతో వచ్చిన ట్రైన్ ఆ ఇద్దరు యువకులను బలంగా ఢీకొట్టగా.. వారు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






