Tragedy: సిద్ధిపేట జిల్లాలో విషాదం.. ఉపాధి హామీ పనికి వెళ్లి తల్లీ, కూతురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-30 08:20:55  IST  )

ఉపాధి హామీ పనికి వెళ్లి తల్లీ, కూతరు దుర్మరణం పాలైన విషాదం ఘటన సిద్దిపేట జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Tragedy: సిద్ధిపేట జిల్లాలో విషాదం.. ఉపాధి హామీ పనికి వెళ్లి తల్లీ, కూతురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/హుస్నాబాద్: ఉపాధి హామీ పనికి వెళ్లి తల్లీ, కూతరు దుర్మరణం పాలైన విషాదం ఘటన సిద్దిపేట జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సరోజన (45) అన్నాజీ మమత (28) రోజు మాదిరిగానే మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో భాగంగా కూలీ పనికి వెళ్లారు. మట్టిని తవ్వుతున్న క్రమంలోనే పైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు సరోజన, మమత మీద పడిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఉపాధి కూలీ రేణుక, స్వరూపలకు కాలు విరిగింది. విషయంల తెలుసుకున్న గ్రామస్థులు చనిపోయిన సరోజన, మమత‌లను బండరాళ్ల మధ్య నుంచి అతి కష్టం మీద బయటికు తీశారు. అలాగే తీవ్రంగా గాయపడి కాలు విరిగిన రేణుక, స్వరూప‌లను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హుటాహుటిన హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హ‌మీ ప‌నుల్లో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెంద‌డం ప‌ట్ల మంత్రి సీతక్క (Minister Seethakka) మంత్రి సీత‌క్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా డీఆర్డీవోను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. జ‌రిగిన ప్రమాదం‌పై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడిన సీత‌క్క వివ‌రాలు తెప్పించుకున్నారు. ప్రమాదం జ‌రిగే సంభవించే ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలతో ప‌నులు చేయించొద్దని జిల్లా అధికారులకు వారం క్రితమే చెప్పినా.. ప‌నులు చేయించడం పట్ల ఆమె తీవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై సమ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరికి మెరుగైన చికిత్స అందించాల‌ని సూచించారు. మరణించిన, గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీత‌క్క హ‌మీ ఇచ్చారు. బాధిత కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల‌ని గ్రామీణాభివృద్ది శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

Next Story