- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: కన్నకొడుకే కాలయముడై.. బెంగళూరులో వృద్ధురాలి దారుణ హత్య
బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లో ఓ వ్యక్తి పక్షవాతంతో ఉన్న తన 75 ఏళ్ల తల్లిని అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేసి హత్య చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: జన్మనిచ్చిన కన్నతల్లిని దైవంతో సమానంగా భావించే ఈ సమాజంలో, ఓ కొడుకు కనికరం లేకుండా ప్రవర్తించిన తీరు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అనారోగ్యంతో మంచం పట్టిన 75 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుమారుడు అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసి హత్య చేసిన దారుణ ఘటన బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్ (RR Nagar), బీఈఎంఎల్ లేఅవుట్‌లో వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే..?
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు వెంకటేష్ (Venkatesh) అలియాస్ దశరథ్ ఓ ప్రైవేటు కంపెనీ షోరూమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లి సావిత్రమ్మ (75) గత ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. పదేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లి సంరక్షణ బాధ్యతను వెంకటేష్ చూస్తున్నాడు. అయితే, ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులు భరించడం, ఆమెను చూసుకోవడం రోజురోజుకూ తనకు భారంగా మారుతోందని వెంకటేష్ భావించాడు. బుధవారం మధ్యాహ్నం, భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో వెంకటేష్ తన తల్లిని ఎత్తుకుని అపార్ట్‌మెంట్ (Apaetment) నాలుగో అంతస్తుకు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆమెను కనికరం లేకుండా కిందకు పడేశాడు. తీవ్ర గాయాలైన సావిత్రమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా వెంకటేష్ తన ఇంటికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
విషయం తెలిసింది ఇలా..
భవనం వెనుక ఏదో భారీ వస్తువు పడినట్లుగా శబ్దం రావడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇంటి యజమాని విక్రమ్ బయటకు వచ్చి చూశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలిని చూసి షాక్‌కు గురైన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఆర్‌ఆర్ నగర్ (RR Nagar) పోలీసులు వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. ‘నా తల్లి ఆరోగ్యం కుదుటపడటం లేదు. ఆమెను చూసుకోవడం కోసం గతంలో ఉద్యోగం కూడా వదిలేశాను. ప్రతిరోజూ నరకంలా అనిపించింది. అందుకే ఆమెను వదిలించుకోవాలని ఈ పని చేశా’ అంటూ నిందితుడు వెంకటేష్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు.






