- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరంగల్ లో విషాదం.. మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. భర్తపైనే అనుమానం..?
by Taduka Kalyani |
వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ ఎదులాపురం మౌనిక అనుమానస్పద స్థితిలో మృతి చెందింది.

X
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్‌లో మహిళా కానిస్టేబుల్ ఎదులాపురం మౌనిక అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్త శ్రీధర్ తీవ్రంగా కొట్టి ఆ తర్వాత ఉరేసుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరుగగా ఆలస్యంగా మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. మౌనికను శ్రీధర్ నిత్యం వేధింపులకు గురిచేసేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా మృతదేహాన్ని ఎంజీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది. ఇది ఇలా ఉండగా మౌనిక మహబూబాబాద్ డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేది.
Next Story






