నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో దంపతుల మృతి

by Kema Shiva Kumar |

నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలోని ఉట్‌పల్లిలో ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు.

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో దంపతుల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కరెంట్ షాక్‌తో దంపతులు దుర్మరణం పాలైన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలోని చోటుచేసుకుంది. ఉట్‌పల్లి దంపతులిద్దరూ ఇంట్లో ఉతికిన బట్టలను ఆరవేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బట్టలు ఆరవేసే తీగకు ప్రమాదవశాత్తూ విద్యుత్ సరఫరా కావడంతో, దాన్ని గమనించని జ్యోతి, సంజీవ్‌లు ఒక్కసారిగా తీవ్ర విద్యుదాఘాతానికి (Electric Shock) గురై ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ మరణించడంతో ఉట్‌పల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దంపతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story