- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు బాలికల మృతి..
నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామంలో సోమవారం తీవ్ర విషాదం జరిగింది.

X
దిశ, మరికల్ / దేవరకద్ర: నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామంలో సోమవారం తీవ్ర విషాదం జరిగింది. చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలికలు మృత్యువు పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. నర్వ మండలం పాతర్సైడ్ కు చెందిన శ్రావణి (14), మహేశ్వరి (12)లు హైదరాబాదులో జరిగిన వివాహ వేడుకలకు హాజరై అమ్మమ్మ ఊరు అయిన రాకొండ గ్రామానికి చేరుకున్నారు.
సోమవారం తమ బంధువు అయిన రాధిక (19)తో కలిసి సమీపంలో ఉన్న చెక్ డ్యాంలో ఈత కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో చెక్ డ్యాం లోతుగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్నవారు గుర్తించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అక్కడికి చేరుకొని పరిశీలించగా ముగ్గురు అప్పటికే మృతి చెందినట్లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆసుపత్రికి తరలించారు.
Next Story






