- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని కూకట్‌పల్లి (Kukatpally)లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కైతలాపూర్ (Kaithalapur) రాఘవేంద్ర కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులను హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త, ఇతర కుటుంబ సభ్యుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే, ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం






