- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి దుర్మరణం
కామారెడ్డిలో విషాదం నెలకొంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ చెరువులో ఆదివారం ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు.

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డిలో విషాదం నెలకొంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ చెరువులో ఆదివారం ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు కథనం ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన కుర్మ రాకేష్ (15) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో మరో ఇద్దరు మిత్రులతో కలిసి గొర్లు మేపడానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఎండ తాకిడికి చెరువులో ఈత కొట్టడానికి ముగ్గురు దిగారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు రాకేష్ చెరువులో ఉన్న గుంతలో ఊపిరాడక మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. రాకేష్ తల్లి స్వప్న ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






