జనగామలో విషాదం.. చిన్నారి, నానమ్మ మృతి

by velandi.Saikiran |

జనగామలోని అంబేద్కర్ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.

జనగామలో విషాదం.. చిన్నారి, నానమ్మ మృతి
X

దిశ, జనగామ: జనగామలోని అంబేద్కర్ నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల వివరాల ప్రకారం.. రెండేళ్ల చిన్నారి రియాన్సీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఇక ఆ చిన్నారి మృతిని తట్టుకోలేక ఆమె నానమ్మ మారబోయిన నాగమ్మ తీవ్ర ఆవేదనకు గురై ఏడుస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒకే ఇంట్లో చిన్నారి, నానమ్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story