- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో విషాదం.. నేవీ విమానం కూలి ఐదుగురు మృతి
ఒక అభం శుభం తెలియని పసిగుడ్డు ప్రాణాలను కాపాడేందుకు చేపట్టిన అత్యవసర వైద్య ప్రయాణం విషాదాంతమైంది.

దిశ, వెబ్ డెస్క్: ఒక అభం శుభం తెలియని పసిగుడ్డు ప్రాణాలను కాపాడేందుకు చేపట్టిన అత్యవసర వైద్య ప్రయాణం (Emergency medical travel) విషాదాంతమైంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, గాల్వేస్టోన్ కాజ్‌వే సమీపంలో మెక్సికో నావికాదళానికి (Mexican Navy) చెందిన ఒక విమానం సోమవారం మధ్యాహ్నం సముద్రంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఒక చిన్నారితో సహా కనీసం ఐదుగురు మరణించినట్లు అమెరికా కోస్ట్ గార్డ్ ధృవీకరించింది.
మెక్సికోకు చెందిన 'మిచౌ అండ్ మౌ' ఫౌండేషన్ ('Michou and Mau' Foundation) ఆధ్వర్యంలో, తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న ఒక ఏడాది వయస్సున్న చిన్నారిని మెరుగైన చికిత్స కోసం గాల్వేస్టోన్‌లోని ష్రైనర్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో నలుగురు నావికాదళ అధికారులు, చిన్నారితో సహా నలుగురు పౌరులు (మొత్తం 8 మంది) ఉన్నారు. గాల్వేస్టోన్ బే సమీపంలో విమానం ల్యాండ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు అదుపుతప్పి నిస్సారమైన నీటిలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో భారీగా పొగమంచు (Fog) కురుస్తోందని, విజిబిలిటీ కేవలం అర మైలు కంటే తక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రతికూల వాతావరణమే విమానం కూలిపోవడానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడగా, మరో 27 ఏళ్ల మహిళ ఎటువంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడటం గమనార్హం. అమెరికా విమానయాన సంస్థలు (FAA & NTSB) ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయి.






