- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: పాఠశాలలో భీకర కాల్పులు.. నలుగురు మృతి, 20 మందికి గాయాలు
టర్కీలో వరుసగా రెండో రోజు పాఠశాలలో కాల్పులు కలకలంరేపాయి. కహ్రమన్‌మరాస్‌లో ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: వరుస కాల్పుల ఘటనలు టర్కీ (Turkey)లో అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఉపాధ్యాయుడితో పాటు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇది రెండో కాల్పుల ఘటన కావడం గమనార్హం. ఆగ్నేయ టర్కీలోని కహ్రమన్‌మరాస్ (Kahramanmaras) ప్రావిన్స్‌లోని ఓ పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కొడుకు తుపాకులను బ్యాగులో దాచుకుని పాఠశాలకు వచ్చాడు. అనంతరం బ్రేక్ టైమ్‌లో రెండు తరగతి గదుల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నలుగురు మరణించగా, కాల్పులు జరిపిన విద్యార్థి కూడా మరణించినట్లుగా గవర్నర్ ముకర్రెమ్ ఉన్లుయర్ (Governor Mukarrem Unluyer) ధృవీకరించారు.
రెండో రోజు.. రెండో ఘటన
అయితే, ఈ ఘోరం జరగిన సరిగ్గా ఒక రోజు ముందు శాన్లియుర్ఫా (Sanliurfa) ప్రావిన్స్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో మరో మాజీ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో 16 మంది గాయపడగా, నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, వరుస కాల్పుల ఘటనలతో టర్కీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జస్టిస్ మినిస్టర్ అకిన్ గుర్లెక్ ఈ దాడులపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా పాఠశాలల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.






