- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. లిఫ్ట్‌లో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి
by Kema Shiva Kumar |
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని గౌలిదొడ్డిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: లిఫ్ట్‌లో చిక్కుకున్ని ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన గచ్చిబౌలి (Gachibowli) పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డి (Goulidoddi)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌లో తల్లిదండ్రులతో బిస్తు ఘోష్ అనే ఐదేళ్ల చిన్నారి నివసిస్తోంది. ఇవాళ హాస్టల్‌లోని గ్రిల్ లిఫ్ట్‌లో వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ఆ చిన్నారి లిఫ్ట్ గ్రిల్స్ మధ్య చిక్కుకుపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి బిస్తు ఘోష్ మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story






