- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy: పేలిన గ్యాస్ సిలిండర్.. స్పాట్‌లోనే ఏడుగురు సజీవ దహనం
గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి ఏడుగురు స్పాట్‌లోనే సజీవ దహనమైన హృదయ విదారక ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని పరగణాల జిల్లా (Parganala District)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి ఏడుగురు స్పాట్‌లోనే సజీవ దహనమైన హృదయ విదారక ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని పరగణాల జిల్లా (Parganala District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పఠార్ ప్రతిమా బ్లాక్ (Pathar Pratima Block)లోని ధోలాఘాట్ (Dholaghat) గ్రామంలోని ఓ ఇంట్లో సోమవారం అర్థరాత్రి ఉన్నట్టుండి గ్యాస్ సిలిండర్ పేలినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో పేలుడు ధాటికి నలుగురు పిల్లలతో సహా ముగ్గురు మహిళలు స్పాట్‌లోని సజీవ దహనమయ్యారు. అదేవిధంగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లుగా సుందర్‌బన్ జిల్లా ఎస్పీ కోటేశ్వర రావు (SP Koteswara Rao) పేర్కొన్నారు. ఇంట్లో నిల్వ చేసిన బాణసంచా పేల్చడంతోనే లోపల ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు బ్లాస్ట్ అయి ఉండొచ్చని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.






