విషాదం.. ఈతకు వెళ్లి బాలుడు మృతి..

by Taduka Kalyani |

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి బాలుడు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలో జరిగింది.

విషాదం.. ఈతకు వెళ్లి బాలుడు మృతి..
X

దిశ, రేవల్లి: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి బాలుడు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానగల్ మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన రామచంద్ర, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. కాగా మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో బంధువుల శుభకార్యం నిమిత్తం మంగళవారం గ్రామానికి వచ్చారు. కాగా చిన్న కుమారుడు అశోక్ (14) బుధవారం తోటి పిల్లలతో కలిసి గ్రామ శివారులో ఉండే బావిలోకి ఈతకు వెళ్లాడు.

బావిలో దూకిన అశోక్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి బయటకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు బావిలో ఎంత వెతికినా బాలుడు కనిపించలేదు. దీంతో మోటార్ల సహాయంతో 40 ఫీట్ల మేర నీటిని బావిలో నుంచి తోడేసి గురువారం బాలుడి మృతదేహం బయటకు తీశారు. ఈ ఘటనతో మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story