పెళ్లిలో తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ మృతిచెందిన మహిళ

by Yella Dhawani Reddy |

అంతా సంతోషంగా ఉన్న పెళ్లి సందడిలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

పెళ్లిలో తీవ్ర విషాదం.. డ్యాన్స్ చేస్తూ మృతిచెందిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: అంతా సంతోషంగా ఉన్న పెళ్లి సందడిలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా డ్యాన్స్ చేస్తూ మహిళ గుండెపోటుతో మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో చోటుచేసుకుంది. మామల్లపురంలో బుధవారం స్నేహితుడి కుమారుడి పెళ్లికి జీవా, జ్ఞానం అనే దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లిలో నేపథ్య గాయకుడు వేలుమురుగన్ సంగీత కచేరి ఏర్పాటు చేయగా, జీవా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story