Tragedy: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. ప్రేమ జంట బలవన్మరణం

by Kema Shiva Kumar |

ప్రేమజంట బలన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా (Karimnagar District) చొప్పదండి (Choppadandi) మండల పరిధిలో చోటుచేసుకుంది.

Tragedy: రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం.. ప్రేమ జంట బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమజంట బలన్మరణానికి పాల్పడిన హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా (Karimnagar District) చొప్పదండి (Choppadandi) మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలీసుల కథనం మేరకు చిత్యలపల్లి (Chithyalapally)కి చెందిన అరుణ్ కుమార్ (Arun Kumar) (24) కరీంనగర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భూపాలపట్నం (Bhupalapatnam) గ్రామానికి అలేఖ్య (Alekhya) (21)తో రెండేళ్ల క్రితం పరిచయం అయింది. అయితే, కొన్నాళ్లుకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇదిలా ఉండగానే అలేఖ్య (Alekhya)కు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఇంట్లో తన ప్రేమ వ్యవహారం చెబితే ఎక్కడ ఒప్పుకోరని గ్రహించిన అరుణ్ కుమార్ (Arun Kumar), అలేఖ్య (Alekhya)లు కలిసే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం వారు కరీంనగర్‌లోని తమకు తెలిసిన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఆ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన పట్టణవాసులు పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story