- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tragedy: నగరంలో తీవ్ర విషాదం.. పతంగి తీసిన చిన్నారి ప్రాణం
పతంగి కోసం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన బాలుడు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పతంగి కోసం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కిన బాలుడు కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాపిరెడ్డి నగర్ కాలనీ (Papireddy Nagar Colony)కి చెందిన రాహుల్ (7) అనే బాలుడు ఆదివారం తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో వారు ఎగురవేస్తున్న పతంగి దారం తెగి, సమీపంలోనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది.
అయితే, పతంగిని ఎలాగైనా తీసుకోవాలనే ఆరాటంతో ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిన ఆ చిన్నారి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఒక్కసారిగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారం కావడంతో రాహుల్ తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలైన బాలుడిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రాణాలు కాపాడలేకపోయారు. అనంతరం చికిత్స పొందుతూ రాహుల్ మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.






